: భయపడక్కర్లేదు.. వీఐపీల భద్రతను తగ్గించం: వెంకయ్య


దేశంలో ఉన్న ప్రజలంతా వీఐపీలే అంటూ వీఐపీల కార్లపై ఎర్రబుగ్గలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో వీఐపీల గుండెలు గుభేలుమన్నాయి. సెక్యూరిటీని కూడా తీసేస్తారేమోనని కొందరు భయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుదు స్పందించారు. వీఐపీల భద్రతను తగ్గించే ఆలోచన తమకు లేదని... భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొంత మంది ముఖ్యమైన వ్యక్తులను రక్షించాల్సిన బాధ్యత ఉంటుందని... వారి రక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News