: అమెరికాలో 14 ఏళ్ల బాలికపై విద్వేష దాడి


అమెరికాలో జరిగిన మరో విద్వేష దాడి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్జియా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల ముస్లిం బాలికపై దాడి చేసిన ఓ వ్యక్తి... ఆమె ధరించిన హిజాబ్ ను చించేశాడు. అనంతరం ఆమెను ఉగ్రవాది అంటూ గట్టిగా అరిచాడు. సోమవారం రాత్రి అట్లాంటాలోని ఓ మాల్ వద్ద కొందరితో కలసి సదరు బాలిక నడుచుకుంటూ వెళుతున్న సమయంలో... పార్కింగ్ స్థలం వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనను దాడిగానే పరిగణిస్తున్నామని... నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. పౌరుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News