: 'మూడు నెలల్లో హంద్రీనీవా పనులా?' అంటూ చంద్రబాబుకు దండం పెట్టిన జేసీ


మూడు నెలల్లో హంద్రీనీవా కాలువల వెడల్పు పనులను పూర్తి చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని గొప్ప ఆలోచనగా చెబుతూనే, ఆ పనులు పూర్తవుతాయన్న నమ్మకం తనకు లేనేలేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పకనే చెప్పారు. కాలువల వెడల్పు ఆలోచన చంద్రబాబు కలని చెబుతూ, ఆ పనులు ఎప్పటికి పూర్తయ్యేను అన్నట్టు ఆయనవైపు తిరిగి రెండు చేతులూ ఎత్తి దండం పెట్టడంతో, అక్కడున్న సభికులతో పాటు హాజరైన ప్రజలందరూ గట్టిగా నవ్వారు.  అందరూ చంద్రబాబులా కృత నిశ్చయంతో లేరని, ఈ పనులు జరగాలంటే వేలాది మంది కూలీలు నిత్యమూ శ్రమించాలని, అంతకన్నా దేవుడి ఆశీర్వాదాలు కావాలని అన్నారు. ఈ విషయాన్ని మరవరాదని, తాను చంద్రబాబును విమర్శించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశాన్ని ఏమీ అనలేదని, ఆ పార్టీ చచ్చిపోయి, కుళ్లిపోయి, వాసన వస్తుంటే, తట్టుకోలేక బయటకు వచ్చానని అన్నారు.

  • Loading...

More Telugu News