: పార్టీ మొత్తం అద్వానీ వెంటే ఉంటుంది: అమిత్ షా


బాబ్రీ మసీదును కూల్చివేసిన కేసులో నిన్న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించిన తర్వాత బీజేపీ అగ్రనేతలు మోదీ నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి ఫోన్ చేశారు. పార్టీ మొత్తం మీ వెంటే ఉంటుందని ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. అంతేకాదు, కోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యకు వెళ్లాలని కేంద్ర మంత్రి ఉమాభారతి భావించారు. ఈ విషయం తెలుసుకున్న అమిత్ షా వెంటనే ఆమెకు ఫోన్ చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అయోధ్య పర్యటనను రద్దు చేసుకోవాలని ఆమెను షా కోరారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News