: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు సంభవించడం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతోంది. తాజాగా ఈరోజు రెండవ కనుమ వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వెంకన్నను దర్శించుకోవడానికి భక్తులతో వెళుతున్న బొలెరో వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.