: పుణే కెప్టెన్సీ వదులుకున్న లంక ఆల్ రౌండర్


శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ పుణే వారియర్స్ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్-6లో పేలవ ఫామ్ తో సతమతమవుతున్న మాథ్యూస్ కు కొన్ని మ్యాచ్ లకు జట్టులో స్థానం కూడా అనిశ్చితిలో పడింది. దీంతో, కెప్టెన్సీ వదులుకోవాలని మాథ్యూస్ నిర్ణయించుకున్నాడు. కాగా, మాథ్యూస్ స్థానంలో ఆసీస్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ వారియర్స్ పగ్గాలు చేపట్టనున్నాడు. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్తో కూస్తో పరుగులు సాధించింది ఫించ్ ఒక్కడే కావడం విశేషం. ఫించ్ 8 మ్యాచ్ ల్లో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News