: తెలివితేటల్లో జలీల్ ఖాన్ ను మించిపోయిన లోకేష్ బాబు: రోజా
తనకున్న అపారమైన తెలివితేటలను ప్రదర్శించడంలో జలీల్ ఖాన్ ను లోకేష్ బాబు మించిపోయారని వైకాపా మహిళా నేత రోజా వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిపోయారని, తన తండ్రి 21 మార్లు విదేశీ పర్యటనలు చేసి, 21 ఉద్యోగాలను కూడా సృష్టించని వేళ, లోకేష్ రెండేళ్లలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానని అంటున్నారని, ఆయన్ను ఏమనాలో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.
వర్థంతికి, జయంతికి ఏం మాట్లాడాలో తెలియకుండా, వర్థంతికి శుభాకాంక్షలు చెప్పిన దౌర్భాగ్యుడైన మంత్రిని రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు రుద్దారని నిప్పులు చెరిగారు. ఎంతో అనుభవమున్న పార్టీ నేతలను పక్కనబెట్టి, పార్టీ మారిన వారికి, రాజకీయ అనుభవం లేని వారికి, ప్రజా సమస్యలపై అవగాహన లేని వారికి చంద్రబాబు పెద్ద పీట వేశారని విమర్శలతో విరుచుకుపడ్డారు.