: ఆ మెయిల్ ఫేక్...విమానాశ్రయానికి హైజాక్ మెయిల్ చేసింది అమ్మాయి కాదు.. హైదరాబాద్ అబ్బాయి!
ఒక గ్రూప్ సభ్యులు విమానాశ్రయాల్లో ప్రవేశించి, విమానాలను హైజాక్ చేయాలని నిర్ణయించారంటూ విమానాశ్రయాధికారులకు ఒక మహిళ పంపిన ఈ మెయిల్ పెనుకలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ మెయిల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్టణం విమానాశ్రయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, భారీ భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మూడు రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ, అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకోకపోవడంతో ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆరాతీశారు. చివరికి ఈ మెయిల్ మహిళ పంపలేదని నిర్ధారణకు వచ్చారు. ఈ మెయిల్ ను హైదరాబాదు నుంచి వంశీ అనే వ్యక్తి పంపినట్టు గుర్తించారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.