: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. మోదీ నివాసంలో రెండు గంటలపాటు బీజేపీ అగ్రనేతల భేటీ
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ లు భేటీ అయ్యారు. వీరి సమావేశం దాదాపు 2 గంటల సేపు కొనసాగింది. తీర్పు నేపథ్యంలో తలెత్తే రాజకీయ, న్యాయపరమైన ఇబ్బందులు... వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన మార్గాలపై వీరు చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో కశ్మీర్ సమస్యతో పాటు మరికొన్ని ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించారని తెలుస్తోంది. మరోవైపు, అయోధ్య వెళ్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి ఉమాభారతి... పార్టీ హైకమాండ్ సలహా మేరకు తన పర్యటనను విరమించుకున్నారు.