: పైలట్ చాకచక్యంతో జెట్ ఎయిర్ వేస్ విమానానికి తప్పిన పెను ప్రమాదం
నిన్న సాయంత్రం డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్ వేపై దిగుతుండగా అదుపుతప్పిన విమానం.... పక్కకు వెళ్లిపోయింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, పైలట్ చాకచక్యంతో వ్యవహరించి, పెను ప్రమాదం జరగకుండా కాపాడాడు. ల్యాండవుతున్న సమయంలో విమానం ముందు చక్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో స్టీరింగ్ సమస్య వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.