: అర్ధరాత్రి దినకరన్ కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు కోసం జాతీయ ఎన్నికల సంఘం అధికారులకు లంచంగా 50 కోట్ల రూపాయలు సుఖేష్ చంద్రశేఖరన్ అనే బ్రోకర్ ద్వారా ఇవ్వజూపాడన్న నేరంపై శశికళ మేనల్లుడు దినకరన్ కు ఢిల్లీ పోలీసులు గత అర్ధరాత్రి సమన్లు జారీ చేశారు. ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ టీమ్ తో కలిసి చెన్నైలోని దినకరన్ నివాసానికి వెళ్లి, అర్ధరాత్రి సమయంలో సమన్లు జారీ చేశారు. వ్యక్తిగతంగా సోమవారం విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ సందర్భంగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. దీనిపై గత 20 ఏళ్లుగా తన పాస్ పోర్టు కోర్టులోనే ఉందని, తాను విదేశాలకు ఎలా వెళ్తానని ఆయన ప్రశ్నించారు.