: అచ్చం బృహస్పతి లాంటిదే.. మరో గ్రహాన్ని కనుగొన్న జపాన్ పరిశోధకుల బృందం


భూమికి 21 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న బృహస్పతి లాంటి గ్రహాన్ని జపాన్ పరిశోధకులు గుర్తించారు. బృహస్పతి కంటే మూడు రెట్ల ఎక్కువ ద్రవ్యరాశితో నిండిన ఈ భారీ గ్రహం పాలపుంత ఆవల కనబడినట్టు జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ పరిశోధకుడు నవోకీ కోషిమోటో తెలిపారు. న్యూజిలాండ్‌లోని ఏవోఏ-2 టెలిస్కోప్ సాయంతో గతేడాది మేలో దీనిని తొలిసారి గుర్తించామని, ‘ఎంవోఏ-2016-బీఎల్‌జీ-227గా దీనిని పిలుస్తున్నట్టు నవోకీ తెలిపారు. గ్రహానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు దీనికి ఉన్నట్టు తమ తర్వాతి పరిశోధనలో తేలినట్టు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News