: పవన్ కల్యాణ్ తో చాలాసేపు మాట్లాడానని సంతోషపడ్డ రాశి


గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటి రాశి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కించిన ‘కల్యాణ వైభోగమే’ చిత్రం ద్వారా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లంక’ సినిమాలో రాశి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, భద్రత లేని సమాజం లంకతో సమానం అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారన్నారు.

ఈ సందర్భంగా ‘గోకులంలో సీత’ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన తాను నటించిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. ఈ మధ్య తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వెళ్లినట్టు చెప్పింది. అయితే, ‘అపాయింట్ మెంట్ తీసుకున్నారా?’ అని అక్కడి వాళ్లు తనను అడగడంతో, అక్కడే కొంచెం సేపు వేచి చూడాల్సి వచ్చిందని చెప్పింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న పవన్, వెంటనే తనను లోపలికి పిలిపించారని, చాలాసేపు మాట్లాడారని చెప్పింది. ‘గోకులంలో సీీత’ సినిమా షూటింగ్ సమయంలో కన్నా, మొన్న కలిసినప్పుడే పవన్ తో ఎక్కువ సేపు మాట్లాడానని రాశి సంతోషపడింది.

  • Loading...

More Telugu News