: పోలీసుల‌తో వాగ్వివాదానికి దిగిన శివసేన ఎంపీ గైక్వాడ్


ఎయిర్‌లైన్స్ ఉద్యోగితో వాగ్వివాదానికి దిగి దురుసుగా ప్ర‌వ‌ర్తించి, చేయిచేసుకుని ఇటీవ‌లే దేశ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచిన శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ ఈ రోజు పోలీసుల‌తో గొడ‌వ ప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌లోని లాతూర్‌లో ఏటీఎంలు ప‌నిచేయ‌డం లేద‌ని ఈ రోజు ఆ ప్రాంతంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అందులో గైక్వాడ్ కూడా పాల్గొని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాలంటూ డిమాండ్ చేశారు. అయితే, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న స్థ‌లికి చేరుకున్న పోలీసులతో ఆయ‌న తీవ్ర వాగ్వివాదానికి దిగారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న వారితో క‌లిసి ఆయ‌న పోలీసుల‌తో గొడ‌వ‌ పెట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News