: బైక్‌పైకి దూకే ప్రయత్నం చేసిన పాము.. తప్పించుకున్న వ్యక్తి.. మీరూ చూడండి!
మనం వెళుతున్న దారిలో పాము కనిపిస్తేనే చాలామంది భయంతో వణికిపోతారు. అలాంటిది పాము మనపైకి దూకాలని ప్రయత్నిస్తే? అటువంటి సంఘటనే థాయ్‌లాండ్‌లోని లంపాంగ్‌లో చోటుచేసుకుంది. ఓ కారులో వెళుతున్న వారు తమ వద్ద ఉన్న కెమెరాతో సరదాగా వీడియో తీసుకుంటూ వెళుతున్నారు. వారి కారు ముందు నుంచి ఓ బైక్ రయ్యు మంటూ స్పీడుగా వెళుతోంది.
అయితే, అదే సమయంలో రోడ్డు మధ్యలోకి వచ్చిన పాము ఒక్కసారిగా బైక్‌పైకి దూకే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన బైక్‌పై ఉన్న వ్యక్తి తన కాళ్లను పైకి ఎత్తుతూ వేగంగా ముందుకి వెళ్లడంతో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ దృశ్యం అంతా కారులో వెళుతున్న వారి కెమెరాకి చిక్కింది. వారు ఆ వీడియోను రెండు రోజుల క్రితమే యూ ట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియోను ఇప్పటివరకు 23 లక్షల మందికి పైగా చూశారు. దీంతో ఆ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోను మీరూ చూడండి..