: ప్రధాని మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భేటీ.. మోదీ అమెరికా పర్యటనపై చర్చ!


అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్‌మాస్టర్ న్యూ ఢిల్లీలో ఈ రోజు భార‌త‌ ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీతో భేటీ అయ్యారు. ఇందులో ప్ర‌ధానంగా మోదీ అమెరికా పర్యటనపై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాలకు ముందుగానే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్, మోదీల‌ మ‌ధ్య సమావేశం జరిగేలా తేదీలను ఖరారు చేయాల‌ని చూస్తున్నారు. దీంతో జూన్ లేక జులైలోనే మోదీ అమెరికా పర్యటన ఉండేలా భార‌త్‌, అమెరికా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు స‌మాచారం. మరోవైపు జర్మనీలోని హాంబర్గ్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే జీ-20 సమావేశంలోనూ పాల్గొన‌నున్న సంద‌ర్భంగా మోదీ, ట్రంప్‌లు మ‌రోసారి కలిసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News