: ‘నంద్యాల స్థానం నాకే ఇవ్వండి’... చంద్రబాబుతో శిల్పా మోహన్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో త్వరలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో భూమా నాగిరెడ్డికి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడితో కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికపై వారు సీఎంతో చర్చిస్తున్నారు. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల స్థానం తమకే ఇవ్వాలని శిల్పా మోహన్‌రెడ్డి కోరుతున్నారు.