: ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసి రూ.2 లక్షలు సంపాదించిన తెలంగాణ హోంమంత్రి నాయిని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గులాబీ కూలీ దినాల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఒమేగా ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఆసుపత్రికి వస్తోన్న రోగుల ఆరోగ్య సమస్యలను అగిడి తెలుసుకుని వారికి పలు ఫైల్స్ అందించారు. ఆయన చేసిన పనికి గానూ సదరు ఆసుపత్రి ఎండీ మోహన్‌వంశీ నాయిని నర్సింహా రెడ్డికి రెండు లక్షల రూపాయల చెక్కును ఇచ్చారు. గులాబీ కూలీ దినాల్లో భాగంగా సంపాదించిన డబ్బుని త్వరలో జరిగే టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు ఖర్చు చేయనున్నారు.