: బాహుబలి-2 ప్రీ టికెట్ బుకింగ్స్ మొదలు


'బాహుబలి: ది కన్ క్లూజన్' ఫీవర్ థియేటర్లను తాకింది. నిన్న ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయిందని, యూ/ఏ సర్టిఫికెట్ లభించిందని వార్తలు రాగా, ఈ ఉదయం ప్రముఖ సినిమా టికెట్ల విక్రయ సంస్థ 'బుక్ మై షో' టికెట్ల ముందస్తు విక్రయాలను ప్రారంభించింది. వెబ్ సైట్ లో 28 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. సినిమా చూడాలనుకుంటున్న రోజు, సమయం, ఏ థియేటర్, టికెట్ రేంజ్, ఎన్ని టికెట్లు కావాలి? వంటి వాటిని ఎంచుకుని డబ్బు చెల్లిస్తే, టికెట్లు ఇస్తామని చెబుతోంది. ఇదే సమయంలో టికెట్లు గ్యారంటీ కాదని, లభ్యతను బట్టి ప్రయత్నిస్తామని, టికెట్ మొత్తంలో తేడా ఉంటే, ఆ డబ్బును వెనక్కు ఇస్తామని షరతులు విధిస్తోంది. ఈ ముందస్తు బుకింగ్ కు కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుండటం గమనార్హం. కాగా, ఈ చిత్రం 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News