: ఫెరా కోర్టుకు వెళ్తూ... ప్రభుత్వాన్ని పడగొడతానని హెచ్చరించిన దినకరన్!


అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ చేసిన సంచలన వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపుతున్నాయి. తమపై ఎమ్మెల్యేలు వేసిన వేటు చెల్లదని ఆయన ప్రకటించారు. బెంగళూరులోని ఫెరా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ, ఇప్పటికీ పార్టీలోని ఎమ్మెల్యేలంతా తనవెంటే ఉన్నారని చెప్పారు. తనను కాదని పార్టీలో ఏదైనా నిర్ణయం జరిగితే తక్షణం ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఆయన హెచ్చరించారు. కాగా, శశికళ, దినకరన్ పై బహిష్కరణ వేటు వేసినట్టు మంత్రి జయకుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే, పది మంది ఎమ్మెల్యేలు దినకరన్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News