: హత్యను ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసారం చేసిన నరహంతకుడి ఆత్మహత్య


వృద్ధుడిని హత్యచేస్తూ దానిని ఫేస్‌బుక్‌లో లైవ్ టెలికాస్ట్ చేసిన అమెరికాకు చెందిన నరహంతకుడు స్టీవ్ స్టెఫెన్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్సిల్వేనియాకు చెందిన స్టెఫెన్స్ ఆదివారం 74 ఏళ్ల వృద్ధుడిని తుపాకితో కాల్చి చంపుతూ దానిని ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసారం చేశాడు. గతంలో ఎంతోమందిని హత్యచేసిన తాను మరికొంతమందిని కూడా చంపనున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే అంతలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు పెన్సిల్వేనియా పోలీసులు మంగళవారం తెలిపారు.

హత్యను లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టెఫెన్స్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో తనకు మూడిందని తెలుసుకున్న నిందితుడు మరో దారిలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, గాడ్విన్‌తో స్టెఫెన్స్‌కు పరిచయం లేకపోయినా ఎందుకు హత్య చేశాడన్నది మాత్రం సస్పెన్స్‌గా మిగిలిపోయింది. గాడ్విన్ హత్య సందర్భంగా తాను గతంలో ఎంతమందిని హత్య చేశానని స్టెఫెన్స్ చెప్పిన దాంట్లో నిజం లేదని, అతడిపై ఎటువంటి క్రిమినల్, నేర చరిత్ర లేదని క్లీవ్‌లాండ్ అధికారులు తెలిపారు. స్టెఫెన్స్‌పై తమకు ఎటువంటి ద్వేషం లేదని, అతడిని క్షమించి వదిలేస్తున్నట్టు గాడ్విన్ కుమారుడు రాబీ మిల్లర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News