: సత్యాగ్రహ దీక్ష.. ఉత్తమ్, షబ్బీర్ అలీ అరెస్టు, విడుదల!
ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసే నిమిత్తం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్ ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో భాగంగా ఈ రోజు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు యత్నించింది. దీక్షకు అమనుతి లేదంటూ అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీసుస్టేషన్ కు తరలించారు. అనంతరం, సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటం ఖాయమని అన్నారు.