: మూట‌లు మోసి రూ.50 వేలు సంపాదించిన టీఆర్ఎస్ నేత‌లు త‌ల‌సాని, క‌విత‌!


త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న టీఆర్ఎస్ స‌మావేశాల‌కు తమ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లంద‌రూ కూలీ ప‌నులు చేసి డబ్బులు సంపాదించుకోవాలని, అందుకోసం గులాబీ కూలీ దినాల్లో పాల్గొనాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన‌ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ కవిత ఈ రోజు కూలీ పని చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి వ‌చ్చిన తలసాని, కవితలు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి, ఆ తరువాత‌ స్థానికంగా ఉన్న రైస్‌ మిల్లుల్లో బియ్యం మూటలు మోసి డ‌బ్బు సంపాదించారు. వారిద్ద‌రు క‌లిసి మొత్తం రూ. 50 వేలు సంపాదించారు. 

  • Loading...

More Telugu News