: నార్త్ కరొలినాలో రాత్రికిరాత్రే హీరోగా మారిన 17 ఏళ్ల కుర్రాడు!


అమెరికాలోని నార్త్ కరొలినాలో తమ్ముడిని కాపాడిన యువకుడు రాత్రికి రాత్రే హీరోగా మారిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నార్త్ కరొలినాలో కిన్ స్టోన్ స్కూల్ లో ఎల్జే గ్రే (17) చదువుకుంటున్నాడు. కుటుంబ సభ్యులంతా తమ తమ విధులకు వెళ్లిపోయారు. దీంతో గ్రే, తన నాయనమ్మ, తమ్ముడు (2) ఇంట్లో ఉన్నారు. తమ్ముడు ఇంట్లో నిద్రిస్తుండడంతో గ్రే ఇంటి బయటపనిలో ముగినిపోయాడు. ఇంతలో వంట గది నుంచి పొగరావడాన్ని గుర్తించిన గ్రే.. నాయనమ్మ...ఇంటి బయటపని చేసుకుంటున్న గ్రే వద్దకు వచ్చి, తమ ఇంట్లోంచే పొగవస్తున్నట్టుందని చూడడమని చెప్పేంతలో కర్రలతో నిర్మించిన ఆ ఇంట్లో మంటలు అలముకున్నాయి.

దీంతో ఇంటికి మంటలు అంటుకున్నాయని, తన తమ్ముడు ఇంట్లో చిక్కుకుపోయాడని గ్రే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వచ్చి బాబును కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు ఇల్లంతా వ్యాపించడంతో లోపలికి వెళ్లేందుకు వీలులేకపోయింది. దీంతో ధైర్యం చేసిన గ్రే... మండుతున్న ఇంటి లోపలికి వెళ్లి, తమ్ముడ్ని ఎత్తుకుని బయటకు వచ్చేశాడు. ఎవరికీ ప్రాణనష్టం సంభవించకపోవడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నామని, ఈ ఫైర్ యాక్సిండెంట్ లో ఒక రియల్ హీరో దొరికాడంటూ ఫైర్ కెప్టెన్ బ్రాస్ తన సోషల్ మీడియా పేజ్, ఫైర్ కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో అతని ఫోటో పెట్టాడు. దీంతో గ్రే రాత్రికిరాత్రే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో హీరోగా మారాడు. 

  • Loading...

More Telugu News