: తీవ్ర ఆర్థిక సమస్యల్లో హీరోయిన్ భూమిక!


పవన్ కల్యాణ్ సరసన 'ఖుషీ' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి భూమిక. ఆ తర్వాత ఎన్నో సినిమాలతో అలరించింది. బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా పలు సినిమాల్లో భూమిక నటించింది. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే యోగా మాస్టర్ భరత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లయిన భూమిక... తన భర్తను సినీ నిర్మాతగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అయితే, ఈ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో... ఆమె ఆర్థికంగా దెబ్బతింది.

ఈ నేపథ్యంలో, భార్యాభర్తలిద్దరికీ విభేదాలు తలెత్తాయి. విషయం విడాకుల వరకు వచ్చిందని ఆ మధ్యన బాలీవుడ్ లో టాక్ వచ్చింది. అయితే, తన వ్యక్తిగత సమస్యల గురించి భూమిక ఎన్నడూ బయటపెట్టలేదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మరోసారి నటనవైపు దృష్టి సారించిన భూమికకు అవకాశాలు రాలేదు. దీంతో 'ధోనీ' సినిమాలో ధోనీకి అక్కగా నటించేందుకు కూడా ఆమె సిద్ధపడింది. ఆ తర్వాత కూడా ఆమెకు అవకాశాలు తలుపుతట్టలేదు. ప్రస్తుతం అక్క, వదిన పాత్రలు చేయడానికి తాను సిద్ధమంటూ ఆమె తనకున్న పరిచయస్తులతో చెబుతోందట. ఈ నేపథ్యంలో, ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News