: విమానయానంలో ఊహించని ఘటన..!


విమానయానంలో అరుదైన ఘటన ఎతిహాద్ ఎయిర్ వేస్ విమానంలో చోటుచేసుకుంది. సాధారణంగా ప్రొసీజర్ ప్రకారం విమానాలు బయల్దేరుతాయి. లాంఛనాలు పూర్తి చేసుకుని గాల్లోకి లేచిన విమానం ఏదైనా సాంకేతిక ఇబ్బంది ఎదురైతే తప్ప మళ్లీ వెనక్కిరాదు. అయితే, ఒక వృద్ధ జంట కోసం ఓ విమానం టేకాఫ్ తీసుకున్నప్పటికీ మళ్లీ వెనక్కి వచ్చింది.  

ఆ వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ నుంచి అబుదాబి మీదుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు వృద్ధ దంపతులు టికెట్ బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానం ఎక్కారు. విమానం బయల్దేరేముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండగా, వారికి ఒక మెసేజ్ వచ్చింది. దానిని వారి అల్లుడు పంపాడు. వారి మనవడు ఆసుపత్రిలో చేరాడని, సిట్చ్యువేషన్ క్రిటికల్ అని మెసేజ్ పెట్టాడు. మరోపక్క విమానం గాల్లోకి లేచేందుకు రన్ వేపై పరుగందుకుంది..వారు తమకు టికెట్లు అరేంజ్ చేసిన సంస్థకు ఫోన్ చేసి తమ పరిస్థితిని వివరించారు.

దీంతో వారు ఎయిర్ లైన్స్ అధికారులతో మాట్లాడి...విమానంలోని పైలట్ తో మాట్లాడించారు. దీంతో అధికారుల ఆదేశాలతో పైలట్ విమానాన్ని ఆపి, రన్ వేపైనే కాకుండా నేరుగా ప్రయాణికులు వెళ్లే గేట్ వద్దకు విమానాన్ని తీసుకొచ్చాడు. దీంతో వారు వెంటనే విమానం దిగి, కారులో ఆసుపత్రికి చేరుకున్నారు. ఒక వృద్ధ దంపతుల కోసం విమానాన్ని ఆపడం ఒక విశేషం అయితే...రన్ వే పై పరుగందుకున్న విమానాన్ని వెనక్కి మళ్లించడం మరింత ఆశ్చర్యకరం. 

  • Loading...

More Telugu News