: నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన దేవినేని!


టీడీపీ నేత దేవినేని నెహ్రూ ఈ రోజు తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. అయితే, నిన్న రాత్రి 10.30 గంటల వరకూ ఆయన తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. వారితో కలిసి భోజనం చేసిన అనంతరం, నిద్రపోయేందుకు తన బెడ్ రూమ్ లోకి వెళ్లారు. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమారు 4.20 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, వారం రోజుల క్రితం వరకూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. గతంలోనూ కిడ్నీ సంబంధిత వ్యాధితో నెహ్రూ బాధపడ్డారు.

  • Loading...

More Telugu News