: టీడీపీ నేత దేవినేని నెహ్రూ కన్నుమూత!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నెహ్రూ మరణ వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నెహ్రూ మృతదేహాన్ని విజయవాడకు తరలిస్తారని సమాచారం.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. విజయవాడ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. నెహ్రూకు ఒక అమ్మాయి, అబ్బాయి వున్నారు.