: హర్యానా మాజీ సీఎం మనవడు, యువ ఎంపీ దుష్యంత్ వివాహం!
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత, హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు, యువ ఎంపీ దుష్యంత్ చౌతాలా వివాహం మేఘనతో రేపు జరగనుంది. హర్యానా పోలీస్ శాఖలో ఐజీ ర్యాంక్ స్థాయి అధికారి పరమ్ జిత్ సింగ్ అహ్లావత్, అనుజా దంపతుల కుమార్తె మేఘన. గురుగ్రామ్ లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
కాగా, ఇరవై తొమ్మిదేళ్ల దుష్యంత్ హిస్సార్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ తండ్రి గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. తల్లి నైనా సింగ్ చౌతాలా సిర్సా జిల్లాలోని దబ్వాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.