: గుజరాత్ లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం!


రెండు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు వెళ్లారు. ఈ సందర్భంగా సూరత్ లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి ప్రారంభమైన రోడ్ షో సర్క్యూట్ హౌస్ వరకు కొనసాగింది. ఈ రోడ్డు షోకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పార్టీ కార్యకర్తలంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. మోదీ రాక సందర్భంగా, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోయాయి. కాగా, ఒడిశాలోని భువనేశ్వర్ లో బీజేపీ జాతీయస్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మోదీ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్నారు.

 

  • Loading...

More Telugu News