: ఉరేసుకోబోయిన టీడీపీ కౌన్సిలర్, చెప్పుతో తనను తాను కొట్టుకున్న వైకాపా ఎమ్మెల్యే... ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా


ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్త వాతావరణం మధ్య మరోసారి వాయిదా పడింది. ఎంతసేపటికీ గందరగోళం తగ్గకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ ఎన్నికలను వాయిదా వేయకుంటే ఉరి వేసుకుంటానంటూ ఓ విద్యుత్ వైరును టీడీపీ కౌన్సిలర్ మెడకు చుట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపై టీడీపీ, వైకాపా సభ్యులు నినాదాలు, ప్రతినినాదాలతో హోరెత్తించగా, శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

ఎన్నికల వాయిదాకు పోలీసులు, అధికారులే కారణమని ఆరోపిస్తూ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైకాపా నేత రాచమల్లు ప్రసాద్ రెడ్డి చెప్పుతో స్వయంగా తనను తాను కొట్టుకోవడం కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని, వారి ఆగడాలను ప్రజలే అడ్డుకుంటారని ఈ సందర్భంగా రాచమల్లు వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News