: టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. కొద్ది సేపటి క్రితం కేసీఆర్ తరఫున మంత్రి ఈటల రాజేందర్, ఇతర పార్టీ ముఖ్యనేతలతో కలసి వెళ్లి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి నామినేషన్ పత్రాలను అందించారు. ఆపై మరో నాలుగు సెట్ల నామినేషన్ పేపర్లను కేసీఆర్ తరఫున పలువురు నేతల నుంచి నాయిని స్వీకరించారు. కేసీఆర్ ఎన్నిక లాంఛనం, ఏకగ్రీవమేనన్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు, ప్లీనరీ జరగనున్న వేళ, అధ్యక్ష పదవికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.