: రాజమౌళి సినిమాల్లో నాకు ఆ సినిమా నచ్చలేదు: రమా రాజమౌళి
ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తీసిన సినిమాల్లో తనకు ఓ మూవీ నచ్చలేదని ఆయన సతీమణి రమా రాజమౌళి అన్నారు. ఈ రోజు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... యమదొంగ సినిమా తనకు నచ్చలేదని చెప్పారు. అయితే, అది నచ్చకపోవడానికి తాను ఏ కారణం చెప్పలేనని అన్నారు. కానీ, ఆ సినిమా బాగానే ఆడిందని, తారక్ వల్లే ఆ సినిమా విజయం సాధించిందేమోనని తాను అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ఇక రాజమౌళిని తాను ఓ విషయంలో మాత్రమే మార్చేశానని అన్నారు. మొదట్లో రాజమౌళి లూజు బట్టలు వేసుకుని తిరిగేవారని, ఇప్పుడు ఆ విషయంలో ఆయనను మార్చేశానని అన్నారు.