: ఉత్తర కొరియా భారీ పరేడ్‌.. యుద్ధానికి యుద్ధంతోనే బదులిచ్చేందుకు సిద్ధమ‌న్న చో రియాంగ్‌ హే


ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ టు సంగ్‌ 105వ జన్మదినం(డే ఆఫ్‌ది సన్‌) సందర్భంగా ఈ రోజు ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆధ్వ‌ర్యంలో భారీ పెరేడ్ జ‌రిగింది. ఈ పెరేడ్‌లో పెద్ద మొత్తంలో అణ్వాయుధాలతో, క్షిపణులతో, సైనిక బలగాలతో ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆ దేశ‌ ప్రభుత్వంలోని ద్వితీయ శ్రేణి అధికారిక ప్రతినిధి చో రియాంగ్‌ హే ప్ర‌సంగిస్తూ ప‌లు వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అణ్వస్త్ర దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. తాము యుద్ధానికి యుద్ధంతోనే బదులిచ్చేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యంలో కిమ్‌ జోంగ్‌ ఉన్ దరహాసం చిందిస్తూ, ఇతర ముఖ్య సైనిక అధికారులతో చర్చిస్తూ క‌నిపించారు. తాడాంగాంగ్‌ నది పక్కన నిర్వ‌హించిన ఈ పరేడ్‌లో పలు అణ్వస్త్రాలను కూడా ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News