: వివాహేతర సంబంధం... విశాఖలో జంటహత్య
విశాఖపట్నం జిల్లాలోని నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో ఓ మహిళ, పురుషుడు నిన్న రాత్రి దారుణ హత్యకు గురి కావడం అలజడి రేపింది. వివాహేతర సంబంధమే వీరిద్దరి హత్యకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి ఆ దారుణానికి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు.