: కలెక్టరుతో కలిసి ఆటోలో ప్రయాణించిన ఏపీ మంత్రి


ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్మిక శాఖమంత్రి పితాని సత్యనారాయణ క‌లెక్ట‌రుతో క‌లిసి ఆటోలో ప్ర‌యాణించారు. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్‌ల‌ను ప్రోత్సహించే క్రమంలో రవాణాశాఖ అధికారులు ఏలూరులో ఒక ఆటోను సమకూర్చారు. అందులోనే మంత్రి పితాని.. కలెక్టర్‌ భాస్కర్‌, ఏలూరు మేయర్‌ నూర్జహాన్‌లతో క‌లిసి కాసేపు ఆటోలో ప్ర‌యాణించి ఓ యాప్ ద్వారా ఆటో బిల్ చెల్లించారు. చిల్లర సమస్యలు తలెత్తకుండా ఆటో చార్జీలకు వీలుగా అధికారులు త‌యారు చేయించిన‌ యాప్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఆయ‌న ఇలా ఆటోలో ప్ర‌యాణించారు. కలెక్టర్‌ భాస్కర్‌ 50 రూపాయలు ఆటో బిల్లును ఆన్‌లైన్‌లో ఆటోడ్రైవర్‌ బ్యాంకు ఖాతాకు సెండ్ చేశారు. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్‌ల దిశ‌గా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని మంత్రి పితాని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News