: తమిళనాడు సీఎం నియోజకవర్గంలో ఫోన్ కొడితే మందు!


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడిలో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. ఫోన్ చేస్తే చాలు మద్యం వారి వద్దకు పరుగులు పెడుతోంది. వివరాల్లోకి వెళ్తే, జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను మూసివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 3400లకు పైగా దుకాణాలు మూతపడ్డాయి. వీటిలో ఎడప్పాడిలో కూడా నాలుగు వైన్స్ ఉన్నాయి. దీంతో, మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు... కొత్త విధానానికి తెరతీశారు. మందు కావాల్సిన వారు ఫోన్ చేస్తే చాలు... వారి వద్దకే మందు తీసుకొచ్చేలా కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. దీంతో, మందు బాబులు ఖుషీ అయిపోతున్నారు. అయితే, మందు సప్లై చేసినందుకు గాను, రూ. 30 సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News