: ఇకపై దేశ వ్యాప్తంగా ‘పెప్సీ’ వాటర్ బాటిల్స్ కు ఒకటే ధర!


ప్రముఖ సంస్థ ‘పెప్సీ’కి చెందిన అక్వాఫినా మినరల్ వాటర్ బాటిల్స్ ధర ఇకపై దేశవ్యాప్తంగా ఒకేలా వుంటుంది. ఈ విషయాన్ని కేంద్ర ఫుడ్ అండ్ కన్స్యూమర్ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. అలాగే, క్రికెట్ స్టేడియాలలో కూడా ఈ వాటర్ బాటిల్స్ ను ఒకే ఎమ్మార్పీకే విక్రయించనున్నట్టు చెప్పారు. ఒకే ఉత్పత్తిపై రకరకాల ఎమ్మార్పీలు తీసుకునే దుకాణదారులపై ఇప్పటికే చర్యలు చేపట్టిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. క్రికెట్ స్టేడియాల్లో విక్రయించే అన్ని రకాల వాటర్ బాటిల్స్ ను దానిపై ఉన్న ఎమ్మార్పీకే విక్రయించేలా చూస్తామని బీసీసీఐ పేర్కొన్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News