: అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పడింది: కవిత


రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఈరోజు ఆమె అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రజల కల సాకారం అయిందని చెప్పారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ పార్టీ పాటుపడుతుందని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదర్శవంతమైన పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News