: బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలసి పని చేస్తా: మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే ఏ పార్టీతోనైనా, కూటమిలోనైనా చేరే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ఆమె, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని మరోసారి ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆ పార్టీని 2019 ఎన్నికల్లో గద్దె దించేందుకు తనవంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. కాగా, తదుపరి లోక్ సభ ఎన్నికల నాటికి దళితుల బలం ఉన్న బీఎస్పీ, ఇతర బీజేపీయేతర పార్టీలు కలసి కూటమిగా ఏర్పడితే, బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.