: విలన్ అవతారం ఎత్తుతున్న మరో హీరోయిన్ భర్త
హీరోయిన్ల భర్తలు టాలీవుడ్ సినిమాల్లో విలన్లుగా ఎంట్రీ ఇస్తుండటం సాధారణమైపోయింది. తాజాగా, తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటి స్నేహ భర్త ప్రసన్న కూడా ఇదే బాట పట్టాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఓ సినిమాలో ప్రసన్న విలన్ గా నటించబోతున్నాడట. విలన్ క్యారెక్టర్ కు ఓ కొత్త ఫేస్ అయితే బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తున్న తరుణంలో... ప్రసన్న వారి దృష్టికి రావడం, ఓకే అయిపోవడం జరిగిపోయిందట. అయితే ఈ తతంగం వెనుక స్నేహ హస్తం ఉందని చెబుతున్నారు. కోలీవుడ్ లో ప్రసన్నకు కొంచెం డిమాండ్ తగ్గడంతో, పక్క భాష చిత్రాల్లో నటించడం బెటర్ అంటూ భర్తకు స్నేహ సలహా ఇచ్చిందట.