: కేసీఆర్ కు వెన్నుపోటు.. వక్రమార్గంలో హరీష్ సీఎం.. టీఆర్ఎస్ పతనం ఖాయం: సర్వే జోస్యం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన మేనల్లుడు హరీష్ రావు వెన్నుపోటు పొడవడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ జోస్యం చెప్పారు. వక్రమార్గంలో హరీష్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం హరీష్ ఎంతో కష్టపడ్డాడని, కేసీఆర్ కు కుడి భుజంగా అన్నీ తానై వ్యవహరించాడని... కానీ, ఇప్పుడు ఆయనను కేసీఆర్ పక్కన పెట్టేశారని అన్నారు. కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితలకు పార్టీ పగ్గాలను కేసీఆర్ అప్పగించారని... ఈ నేపథ్యంలో, హరీష్ రావు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడని సర్వే అన్నారు. ఈ రెండేళ్లలోనే హరీష్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు. తదనంతర కాలంలో టీఆర్ఎస్ పార్టీ పతనం కావడం కూడా ఖాయమని అన్నారు.