: పుత్రశోకంలో వున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం జగన్ వల్ల కూడా కాలేదు!


కడప జిల్లా చిన్నకుడాల క్రాస్ రోడ్డు వద్ద గత నెల 26న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడిన ఘటనలో చంద్రమహేష్, శివమోహన్ రెడ్డిలు మృతి చెందారు. వీరి తల్లిదండ్రులకు వీరు ఏకైక కుమారులు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, వైసీపీ అధినేత జగన్ నిన్న వీరి ఇళ్లకు వెళ్లి, వీరి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా వీరి కుటుంబ సభ్యుల ఆవేదన జగన్ ను కలచివేసింది.

ఇలాంటి ప్రమాదాలు మరెవరికీ రాకుండా చూడాలంటూ విలపిస్తూ వారు జగన్ ను వేడుకున్నారు. వారిని ఓదార్చడం జగన్ వల్ల కూడా కాలేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చనిపోవడం దురదృష్టమని, మీ కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ, రోడ్డు పక్కన ఉన్న పాడుబడిన బావులను వెంటనే పూడ్చివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

  • Loading...

More Telugu News