: స్కాట్‌లాండ్ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్.. తెలంగాణ పోలీసుల కళ్లుగప్పి బాత్‌రూమ్ కిటీకి నుంచి పరార్!


పలు చీటింగ్ కేసుల్లో స్కాట్‌లాండ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న బ్రిటన్ దేశస్తుడు మహ్మద్ అలీ తెలంగాణ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. నకిలీ పాస్‌పోర్టుతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన అలీని అప్పట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో విచారణ ఖైదీగా ఉన్న అలీని బుధవారం పీటీ వారెంట్‌పై ఢిల్లీలోని పాటియాల కోర్టులో హాజరుపరిచారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

దీంతో ఎస్కార్ట్ పోలీసులు అతడిని బాత్‌రూముకు తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన అలీ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు లోపలికి చూడగా కనిపించలేదు. బాత్‌రూము కిటికీ నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను సీఐడీ రంగంలోకి దించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు సిటీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News