: బంగాళాఖాతంలో వాయుగుండం... రాయలసీమ, తెలంగాణలు అగ్నిగుండం
ఆంధ్రప్రదేశ్ లో ఊహించని వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాలు సూర్యుడి భగభగలను చవిచూస్తుండగా... శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పొగమంచు కమ్ముకుంటోంది. శీతాకాలంలోలా ఉదయం 9 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. విశాఖపట్టణం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది నెమ్మదిగా బలపడి వాయుగుండంగా, ఆపై తీవ్రవాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మరోపక్క, ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న మూడు రోజుల్లో ఇవి 47కు చేరుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలు అగ్నిగుండాన్ని తలపించే ప్రమాదం ఉందని, పగలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగే రాయలసీమలోని పలు జిల్లాలను కూడా సూర్యుడు బెంబేలెత్తిస్తాడని వారు హెచ్చరిస్తున్నారు.