: శ్రీలంక మాజీ దిగ్గజ క్రికెటర్ మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు.. లంకేయులకు అంత సీన్ లేదని వ్యాఖ్య!
శ్రీలంక మాజీ క్రికెటర్, లెజండరీ స్పిన్ బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ సొంత దేశ క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం రేపాడు. ప్రస్తుత శ్రీలంక క్రికెటర్లకు ఐపీఎల్‌లో ఆడే సత్తా లేదని గాలి తీసేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లలో మంచి ఆటగాళ్లు ఉన్నారని కితాబిచ్చాడు. ఐపీఎల్‌లో మొత్తం 32 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లకు ఆడే అవకాశం ఉందని, కానీ శ్రీలంక క్రికెటర్లు మాత్రం రాలేకపోతున్నారని పేర్కొన్నాడు. తమ దేశంలో గొప్ప ఆటగాళ్లు ఉన్నా అందరూ రిటైరయ్యారని పేర్కొంటూ ప్రస్తుత జట్టు స్థితిని ఎత్తి చూపాడు.