: ఏ పార్టీ మత రాజకీయాలు చేస్తోందో అందరికీ తెలుసు: కిషన్ రెడ్డిపై మంత్రి తలసాని మండిపాటు!
తెలంగాణలో ముస్లిం, మైనార్టీలకు బీసీ-ఈ కేటగిరీలో రిజర్వేషన్లు పెంచుతున్నామని, ఈ అంశంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి అవాకులు చెవాకులు మాట్లాడటం తగదని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మత విశ్వాసాల ఆధారంగా ఏ పార్టీ రాజకీయాలు చేస్తోందో అందరికీ తెలుసన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఈ రిజర్వేషన్లను పెంచుతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతామని కూడా సీఎం ప్రకటించారనీ, వెనుకబడిన వర్గాల వారందరికీ న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తలసాని పేర్కొన్నారు.