: మళ్లీ ఆస్పత్రిలో చేరిన డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్
శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత నెల 23న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ రెండు రోజులు చికిత్స తీసుకొని డిశ్చార్జీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మళ్లీ అస్వస్థతకు గురవ్వడంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. 20 రోజుల్లో రెండోసారి విజయ్ కాంత్ ఆసుపత్రి పాలయ్యారు. గతంలోనూ ఆయన విదేశాలకు వెళ్లి మరీ వైద్య చికిత్స తీసుకున్నారు. అనారోగ్యంతో ఆయన రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు.