: తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు నెట్వర్క్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. హైదరాబాద్ నగరంలో బీఎస్ఎన్ఎల్ ఓఎఫ్సీ కేబుల్ తెగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొత్తం 1.10 కోట్ల మంది కస్టమర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున ఈ సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.