: రైల్వే జోన్ సాధించి తీరుతాం: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఎట్టి పరిస్థితుల్లోను విశాఖపట్నం రైల్వే జోన్ ను సాధించి తీరుతామని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఉపఎన్నికల ఫలితాలే.. 2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని చెప్పారు. 37 స్థానాలకు గాను 34 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం శుభసూచకమని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. తన చిన్నాన్న అచ్చెన్నాయుడికి పదోన్నతి కల్పిస్తూ ఉన్నతమైన మంచి శాఖలను కట్టబెట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.